భారత స్పీడ్‌స్టర్ ఉమ్రాన్ మాలిక్ లైన్ అండ్ లెంగ్త్ సాధిస్తే ప్రపంచాన్ని ఏలుతాడని సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ అన్నాడు. ‘‘ఉమ్రాన్ పేస్‌ను ఎదుర్కోవడం బ్యాటర్లకు అంత ఈజీ కాదు. తనకెంతో ఎనర్జీ ఉంది. లైన్ అండ్ లెంగ్త్ మార్చుకుని మంచి ప్రదర్శన చేస్తాడని అనుకుంటున్నా. అతడి భవిష్యత్ మరింత మెరుగ్గా ఉంటుంది.’’ అంటూ షమీ పేర్కొన్నాడు. కాగా ఉమ్రాన్ 150 కి.మీ వేగంతో బౌలింగ్ చేస్తున్నా నియంత్రణ, ఖచ్చితత్వం లేక సతమతమవుతున్నాడు. దీనిపై షమీ ఈ వ్యాఖ్యలు చేశాడు.