ఉక్రెయిన్-రష్యా యుద్ధం భారతదేశ ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపుతుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ఈ క్రమంలో భారత జీడీపీ 2022లో 4.6 శాతానికి పరిమితం కావొచ్చని పేర్కొంది. గతంలో భారతదేశం 6.7% వృద్ధిని సాధిస్తుందని ఐరాస అంచనా వేసింది. ఈ యుద్ధం నేపథ్యంలో చమురు ధరల పెంపు సహా పలు కారణాలతో అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఎఫెక్ట్ ఉంటుందని హెచ్చరించింది. మరోవైపు ఈ మార్పుల కారణంగా 2022లో ప్రపంచ ఆర్థిక వృద్ధి అంచనాను 3.6% నుంచి 2.6%కి ఐరాస తగ్గించింది.