ఉక్రెయిన్ విషయంలో రష్యా అవలంభిస్తున్న మొండి వైఖరితో చాలా ఆందోళనగా ఉందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ వ్యాఖ్యానించారు. రష్యా మీద నాటో దళాలు ఏ క్షణంలోనైనా దాడి చేసే అవకాశం ఉందని.. అణు బలగాలు అప్రమత్తంగా ఉండాలని పుతిన్ ఆదేశించడం చాలా విచారకరమన్నారు. ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాల్లో అత్యవసర చర్యల కోసం ఇప్పటికే రూ. 150 కోట్లు విడుదల చేసినట్లు ఆయన పేర్కొన్నారు. భద్రతా మండలిలో చేపట్టిన ఓటింగ్‌కు భారత్ మరోసారి దూరంగా ఉంది. పోయిన శుక్రవారం నిర్వహించిన ఓటింగ్‌కు కూడా భారత్ దూరంగానే ఉంది. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని అన్ని దేశాలు సూచిస్తున్నాయి.