ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో తన పేరు ఎక్కడా లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. సీబీఐ వెబ్‌సైట్‌లో తన పేరు ఎక్కడా లేదని ఆమె స్పష్టం చేశారు. ఈ విషయంపై సీబీఐకి కవిత లేఖ రాశారు. కాగా ముందే ఖరారైన కార్యక్రమాల వల్ల ఈ నెల 6న విచారణకు హాజరు కాలేనని సీబీఐకి తెలిపింది. ఈ నెల 11, 12, 14, 15వ తేదీల్లో ఏదైనా ఒకరోజు హైదరాబాద్ లోని తన నివాసంలో విచారణకు సిద్ధంగా ఉంటానని పేర్కొంది.