తండ్రి మరణాన్ని తట్టుకోలేక కుమారుడు కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్లోని హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తుమ్మలగుట్ట శ్రీకాంత్ ఐటీ ఉద్యోగి. ఇటీవల ఆయన తండ్రి మృతి చెందాడు. తండ్రి మరణంతో తీవ్ర మనస్తాపానికి గురై శ్రీకాంత్ కూడా తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎంతసేపైనా తలుపు తీయకపోవడంతో తన తమ్ముడు ప్రశాంత్కు అనుమానం వచ్చింది. తలుపులు బద్దలు కొట్టి చూడగా శ్రీకాంత్ విగతజీవిగా పడి ఉన్నాడు.
తండ్రి మరణాన్ని తట్టుకోలేక టెకీ ఆత్మహత్య

© Envato