ఎమ్మెల్యే కోటా కింద బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చల్లా వెంకట్రామిరెడ్డి, కూర్మయ్యగారి నవీన్ కుమార్, దేశపతి శ్రీనివాస్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల పరిశీలన పూర్తయ్యే నాటికి నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో ఇండిపెండెంట్ అభ్యర్థి కమల పాలమూరి నామినేషన్ రిజెక్ట్ అయ్యింది. దీంతో వీరు ముగ్గురే బరిలో నిలిచారు. దీంతో వీరు ముగ్గురూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.