TS: హైదరాబాద్ మహానగరంలో మరో కలికితురాయి చేరనుంది. రెండో దశ మెట్రో విస్తరణలో భాగంగా భూగర్భ మెట్రో లైన్ ఏర్పాటు కానుంది. ఈ విషయాన్ని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. రాయ్‌దుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు 31కి.మీ. మేర మెట్రో లైన్‌ని ఏర్పాటు చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు. ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు సమీపంలో 2.5కి.మీ మేర భూగర్భ మెట్రో నిర్మించనున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ కారిడార్‌కు రూ.6,250 కోట్లు ఖర్చవుతుందని, పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే ఈ పనులు జరుగుతాయని స్పస్టం చేశారు. డిసెంబరు 9న ముఖ్యమంత్రి ఈ బృహత్కార్యానికి శ్రీకారం చుట్టనున్నారు.