KCRకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సవాల్

Screengrab Twitter:

సీఎం కేసీఆర్ దమ్ముంటే మతపరమైన రిజర్వేషన్లు ఎత్తివేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సవాల్ చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం రిజర్వేషన్లు ఎత్తివేసినట్లు తెలిపారు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ వ్యతిరేకమని హైకోర్టు చెప్పినట్లు పేర్కొన్నారు. 8 ఏళ్ల తర్వాత గిరిజన రిజర్వేషన్లు ఇప్పుడు కేసీఆర్‌కు గుర్తుకొచ్చాయా అంటూ నిలదీశారు. ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్ల కోసం కృష్టి చేస్తామని కేంద్రమంత్రి అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కేసీఆర్ గత 8 ఏళ్లుగా తెలంగాణ విమోచన దినోత్సవం కూడా జరుపలేదన్నారు.

Exit mobile version