నిరసనలకు తగ్గేది లేదన్న కేంద్ర మంత్రి..అగ్నివీర్లకు భరోసా

© ANI Photo

అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలుచోట్ల నిరసనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్ని నిరసనలు చేసినా తగ్గేది లేదని వెల్లడించారు. ఇప్పటికే రెండేళ్లు వయోపరిమితి పెంచి మరింత మందికి అప్లై చేసుకునే అవకాశం కల్పించినట్లు గుర్తు చేశారు. రక్షణ దళాల్లో చేరాలనుకునే యువతకు ఇది మంచి ఛాన్స్ అని తెలిపారు. అగ్నివీరుల భవిష్యత్తుకు పూర్తి భరోసా ఉంటుందన్నారు. 4 ఏళ్ల తర్వాత సెలక్టు కాకుంటే వ్యవస్థాపకులు కావాలనుకునే వారికి ఆర్థిక ప్యాకేజీ, బ్యాంకు రుణ పథకం లభిస్తుందన్నారు. తదుపరి చదవాలనుకునే వారికి 12వ తరగతి తత్సమాన ధ్రువీకరణ పత్రం అందిస్తామన్నారు. అగ్నిపథ్ ద్వారా యువతకు సాయుధ దళాల్లో పనిచేసే అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. రాబోయే ఏళల్లో ప్రస్తుతం జరుగుతున్న రిక్రూట్‌మెంట్ కంటే అగ్నివీర్‌ల రిక్రూట్‌మెంట్ మూడు రెట్లు ఉంటుందని స్పష్టం చేశారు.

Exit mobile version