కేంద్రంలో ప్రస్తుతం 12 మంత్రిత్వ శాఖలు డ్రోన్ సేవల కోసం ప్రయత్నిస్తున్నాయని విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. వీటి డిమాండ్‌ను పెంచడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. రాబోయే సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా దాదాపు లక్ష మంది డ్రోన్ పైలట్లు అవసరమవుతారని సింధియా మంగళవారం తెలిపారు. డ్రోన్ రంగాన్ని మూడు చక్రాలతో ముందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. పీఎం నాయకత్వంలో అమలు చేయబడిన PLI (ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్) పథకం డ్రోన్ సెక్టార్‌లో తయారీ, సేవలకు ప్రోత్సాహాన్ని ఇస్తుందని కేంద్ర మంత్రి వెల్లడించారు.