డిజిటల్ ఇండియా కార్యక్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మద్రాస్ ఐఐటీ దేశీయంగా అభివృద్ధి చేసిన భరోస్(BharOS) ఆపరేటింగ్ సిస్టంని కేంద్రమంత్రులు నేడు ప్రయోగాత్మకంగా పరీక్షించారు. భారత ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ వంటి ఆపరేటింగ్ సాఫ్ట్వేర్లకు ప్రత్యామ్నాయంగా ఇది రూపుదిద్దుకుంది. ఈ ఆపరేటింగ్ సిస్టంని కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో వినియోగించనున్నారు. ప్రైవసీ, సెక్యూరిటీకి భరోస్ పెద్దపీట వేసింది. పైగా ఇందులో ఎలాంటి డీఫాల్ట్ యాప్స్ ఉండకపోవడం గమనార్హం. కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, అశ్వినీ వైష్ణవ్ పాల్గొన్నారు.