ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ఆపడం లేదు. ఈ దాడులు 25వ రోజుకు చేరుకోగా సాధారణ ప్రజలు కూడా మరణిస్తున్నారు. ఈ క్రమంలో ఐక్యరాజ్యసమితి కీలక విషయం తెలిపింది. యుద్ధం కారణంగా మార్చి 18 వరకు ఉక్రెయిన్ పౌరులు 847 మంది మృతి చెందారని, 1399 మందికిపైగా గాయపడ్డారని పేర్కొంది. వాస్తవంగా ఎక్కువ మంది మరణించి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు 100 మందికిపైగా పిల్లలు మృత్యువాత చెందారని మరో నివేదిక చెప్తోంది. ఈ దాడుల్లో ప్రాణ నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని ఐరాస హెచ్చరించింది.