సికింద్రాబాద్‌లోని మహాత్మాగాంధీ రోడ్లో రద్దీగా ఉండే యూనివర్సల్ బేకరీ ఇటీవల మూతపడింది. 70వ దశకంలో ఎంతో మందికి ఫేవరేట్ బేకరీగా ఇది నిలిచింది. పిజ్జాలు, బర్గర్లు, చైనీస్ ఫాస్ట్ ఫుడ్ వచ్చినా కూడా ఈ బేకరీ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. పీక్ అవర్స్‌లో వెళ్తే ఆర్డర్ రావడానికి గంటల సమయం పట్టేది. అయితే ఇంతటి ఫేమస్ బేకరీ ప్రస్తుతం కొన్ని అనివార్య కారణాల వల్ల మూతపడిపోయింది. దీంతో ఈ బేకరీతో మంచి అనుబంధమున్న హైదరాబాదీలు తమ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు.