చైనాలో తెల్లకాగితం విప్లవం తీవ్ర రూపం దాలుస్తోంది. దేశాన్ని అన్ లాక్ చేయాలంటూ అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. ఈ ఆందోళనలకు ఓవర్సీస్ ప్రాంతాల నుంచి కూడా మద్ధతు వెల్లువెత్తుతోంది. సిడ్నీ, టోక్యో, హాంకాంగ్, న్యూయార్క్, టొరంటోలలో తమ దేశంలో ఆందోళనలు చేస్తున్న ప్రజలకు మద్ధతుగా ఇక్కడి ప్రజలు కూడా ప్రదర్శనలు చేస్తున్నారు. ‘అన్ లాక్ చైనా’, ‘జిన్‌పింగ్ దిగిపోవాలి’ అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు.