ఆప్గానిస్తాన్లో బాలికలను పాఠశాలలకు తిరిగి పంపించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) తెలిపింది. అయితే గత ఏడాది ఆప్గాన్లో తాలిబాన్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆరో తరగతి కంటే ఎక్కువ వయస్సు బాలికలను స్కూళ్లకు వెళ్లకుండా నిషేధించారు. ఈ అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఆప్గానిస్తాన్ సెక్రటరీ జనరల్ డెబోరాతో బాలికలతో సహా ఆప్గాన్లందరీ విద్యా హక్కు గురించి UNSC చర్చించింది. విద్యా హక్కును గౌరవించాలని, మహిళా విద్యార్థులందరిని తిరిగి పాఠశాలలకు పంపించాలని తాలిబన్ ప్రభుత్వానికి సూచించింది.