ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న ‘తెలుగు ఇండియన్ ఐడల్’ లో గెస్ట్‌గా బాలయ్య వస్తున్నాడు. ఈ ఎపిసోడ్ జూన్ 10 న రాత్రి 9 గంటలకు ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో బాలయ్య తన ఎనర్జీ, డ్యాన్స్‌లు, పంచులతో అలరించాడు. ఒక కంటెస్టెంట్ పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిసి భార్యను ఏమార్చడం ఎలా అనే బుక్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. మరో అమ్మాయిని పూజా హెగ్డేలా ఉన్నావంటూ ప్రశంసించాడు. మరో అమ్మాయితో కలిసి స్టేజీపై డ్యాన్స్ వేసి అలరించాడు. బాలయ్య ఎక్కడికొచ్చిఆ ఆ సందడి ఉంటుందని మరోసారి అనిపించాడు. ఈ ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.