ఇటీవల బాలయ్య తెలుగు ఇండియన్ ఐడిల్‌కి గెస్ట్‌గా వచ్చినప్పుడు అన్‌స్టాపబుల్ సీజన్ 2 ఎప్పుడు అని యాంకర్ శ్రీరామచంద్ర ప్రశ్నించాడు. మధుర క్షణాలకు ముగింపు ఉండదు..కొనసాగింపే ఉంటుంది అని బాలకృష్ణ చెప్పాడు. నేడు ఈ విషయాన్ని ఆహా అధికారికంగా ప్రకటించింది. త్వరలో అన్‌స్టాపబుల్ సీజన్ 2 రాబోతుందని ప్రకటించింది. ఆగస్ట్ 15న పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు పేర్కొంది. దీంతో బాలయ్య హోస్టింగ్ కోసం ఫ్యాన్స్ మళ్లీ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.