అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న పంజాబ్, యూపీ రాష్ట్రాల్లో పోలింగ్ చాాలా మందకొడిగా సాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంటవరకు యూపీలో 35.88శాతం, పంజాబ్లో 34.1 శాతం మాత్రమే ఓటింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు తెలియజేశారు. ఇక్కడ పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. చెదురుముదురు ఘటనలు మినహా ఇప్పటి వరకు పోలింగ్ ప్రశాంతంగానే సాగింది.