వానలతో యూపీ అతలాకుతలం

© ANI Photo

ఎడతెరిపి లేని వర్షాలతో ఉత్తరప్రదేశ్ అతలాకుతలమైంది. వానల ప్రభావానికి ఇప్పటివరకు 13 మంది మరణించారు. భారీ వర్షాలకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు జలమయ్యాయి. వర్షాల ప్రభావంతో పాఠశాలలు, కార్యాలయాలకు ప్రభుత్వం ఎమర్జెన్సీ సెలవులు ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీతోపాటు నోయిడా, గ్రేటర్ నోయిడా ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది.

Exit mobile version