యూపీ చివరి విడత ఎన్నికలు ఈ రోజు ప్రారంభం అయ్యాయి. పోలింగ్ మందకొడిగానే సాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 8.58 శాతం ఓటింగ్ నమోదయినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ దశలో ప్రధాని పార్లమెంటరీ నియోజకవర్గంతో పాటు మొత్తం 54 స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మార్చి 10న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికలకు మొత్తం 12,205 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు.