ఉత్తరప్రదేశ్ ఆరో దశ ఎన్నికలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. మొత్తం 10 జిల్లాల్లో 57 స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, సమాజ్‌వాదీకి చెందిన స్వామి ప్రసాద్ మౌర్య, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ కుమార్ లల్లూ బరిలోకి దిగే స్థానాలకు నేడే పోలింగ్ జరుగనుంది. అన్ని పార్టీల ప్రముఖ నాయకులు బరిలో ఉండటంతో ఈ దశ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. అలాగే మార్చి 7న ఏడో దశ పోలింగ్ నిర్వహించి 10వ తేదీన ఫలితాలు వెల్లడించనున్నారు.