డబ్ల్యూపీఎల్‌లో భాగంగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్ ఘన విజయం సాధించింది. 139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వికెట్ కోల్పోకుండా విజయం సాధించింది. ఓపెనర్లు అలిసా హీలీ (96), దేవికా వైద్య(36) రాణించారు. హీలీ మైదానం నలువైపులా బౌండరీలు బాదుతూ బెంగళూరు బౌలర్లకు చుక్కలు చూపించింది. కాగా అంతకుముందు బెంగళూరు138 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులో ఎలిస్సా పెర్రీ(52) అర్థ సెంచరీతో రాణించింది. ఎకిల్‌స్టోన్ 4, దీప్తి శర్మ 3 వికెట్లు తీశారు.