తనకు పుట్టబోయే బిడ్డ గురించి తలచుకుని ఎంతో భావోద్వేగానికి గురవుతున్నట్లు స్టార్ హీరో రామ్‌చరణ్ భార్య ఉపాసన ట్వీట్ చేశారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ఈవెంట్‌లో తన భర్తతో దిగిన ఫొటోలు షేర్ చేస్తూ ట్వీట్ చేసింది. ‘‘ఆర్ఆర్ఆర్ టీమ్‌లో భాగమైనందుకు సంతోషంగా ఉంది. భారతదేవం గర్వించే విషయం ఇది. ఈ అనుభూతిని నాతో పాటు నా బేబీ కూడా ఆస్వాదిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ మధుర క్షణాలు నన్ను భావోద్వేగానికి గురి చేస్తున్నాయి.’’ అంటూ ఉపాసన పేర్కొంది.