దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను పెంపొందించే ప్రయత్నంలో భాగంగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) UPI లైట్‌ను ప్రకటించింది. ఇది ఆఫ్‌లైన్ మోడ్‌లో లావాదేవీలను సులభతరం చేస్తుందని పేర్కొన్నారు. అయితే ఈ యాప్ ప్రొవైడర్లు, బ్యాంకులతో మొదట పైలెట్ ప్రోగ్రామ్‌గా మొదలుపెట్టినట్లు చెబుతున్నారు. మరోవైపు ఆఫ్ లైన్ విధానంలో రూ.200 వరకు మాత్రమే ట్రాన్స్ ఫర్ చేసేందుకు అవకాశం ఉంది. దేశంలో UPI లైట్ ఎప్పుడు ప్రారంభమవుతుందో త్వరలో ప్రకటించనున్నారు.