ఇండియా-న్యూజిలాండ్ మధ్య జరగబోయే తొలి వన్డేకు సంబంధించి రేపటి నుంచి టికెట్లను ఆన్లైన్లో ఉంచనున్నట్లు హెచ్సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ తెలిపాడు. జనవరి 13వ తేదీ 6 వేలు, 14న 7 వేలు, 15న 7 వేలు, 16న 9417 టికెట్లను పేటీఎం ద్వారా విక్రయించనున్నట్లు వివరించారు. టికెట్ రేట్లు రూ.850 నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. ఒక్కో వ్యక్తికి 4 టికెట్లు మాత్రమే ఇస్తామని.. బుక్ చేసుకున్నవారు ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియంలలో టికెట్లు తీసుకోవచ్చని చెప్పారు.