ఎయిర్ ఇండియాకు విమానంలో బిజినెస్ క్లాస్‌లో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికురాలిపై తోటి ప్రయాణికుడు మద్యం మత్తులో మూత్రం పోసిన ఘటనపై ఎయిర్ ఇండియా కేసు నమోదు చేసింది. గతేడాది నవంబర్ 26న యూఎస్ నుంచి దిల్లీకి వస్తున్న విమానంలో ఈ ఘటన జరిగింది. ఎయిర్ ఇండియా దీనిపై అంతర్గత కమిటీని నియమించి, నిందితుడిని ‘నో-ఫ్లై’ లిస్ట్‌లో చేర్చారు. ప్రస్తుతం ప్రభుత్వ కమిటీ దీనిపై విచారణ చేపడుతోంది.