అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, తన మొదటి స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగంలో మట్లాడుతూ, మాస్కో ఉక్రెయిన్‌పై దాడి చేసినందుకు అమెరికా గగనతలం నుంచి రష్యన్ విమానాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చర్యలను ఖండించిన బైడెన్ ఉక్రెయిన్ ప్రజలకు అమెరికా మద్ధతుగా నిలుస్తుందని చెప్పారు. అయితే, ఉక్రెయిన్‌లో రష్యా బలగాలతో అమెరికా బలగాలు ఘర్షణకు దిగబోవని స్పష్టం చేశారు. పుతిన్‌ను నియంతగా అభివర్ణించిన బైడెన్, రష్యన్ నియంత, ఉక్రెయిన్‌పై దాడి చేయడం వల్ల ప్రపంచం మొత్తం ప్రభావితం అవుతుంది. ప్రజాస్వామ్యానికి, నిరంకుశత్వాని మధ్య జరుగుతున్న ఈయుద్ధంలో ప్రజాస్వామ్యాలు ఏకమవుతాయి అని చెప్పాడు. పుతిన్ కీవ్‌ను యుద్ధ ట్యాంకులతో చుట్టుముట్టవచ్చు, కానీ అతను ఉక్రేనియన్ ప్రజల హృదయాలను ఎప్పటికీ పొందలేడు, ప్రపంచ స్వేచ్చను హరించలేడు అని పేర్కొన్నాడు.