ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇండియాపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి వ్యతిరేకంగా మద్దతు తెలిపే విషయంలో క్వాడ్ దేశాల్లో భారతదేశం కొంత వణుకుతోందన్నారు. కొన్ని విషయాల్లో భారత్ తటస్థంగా వ్యవహరిస్తుందని వ్యాఖ్యానించారు. రష్యా అధ్యక్షుడి తీరును ఖండించే విషయంలో జపాన్, ఆస్ట్రేలియా చాలా బలంగా ఉన్నట్లు చెప్పాడు. పుతిన్‌కు వ్యతిరేకంగా NATO, యూరోపియన్ యూనియన్, ఆసియా భాగస్వాముల నేతృత్వంలోని కూటమిని బైడెన్ ప్రశంసించారు.