అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, రష్యా అధ్యక్షుడు పుతిన్ పై వరుసగా కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం వ్యూహాత్మక వైఫల్యమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. కానీ రష్యన్ ప్రజలు తమ శత్రువులు కాదని చెప్పారు. మరోవైపు పుతిన్ పొరుగు దేశాలపై అధికారం చేలాయించకూడదని హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ పోలాండ్‌లోని వార్సా పర్యటనలో భాగంగా వెల్లడించారు. ఇక ఉక్రెయిన్ పై దాడులు ప్రారంభించి నెల రోజులు దాటినా కూడా రష్యా పూర్తిగా పట్టు సాధించలేకపోయింది.