అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చైనాను మరో సారి హెచ్చరించారు. ఉక్రెయిన్‌లో రష్యాకు సాయం చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. గురువారం బ్రస్సెల్స్‌లో జరిగిన NATO శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యాతో కాకుండా పశ్చిమ దేశాలతో కూడా చైనా ఆర్థిక ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయని జిన్ పింగ్ అర్థం చేసుకున్నారని గుర్తు చేశారు. అయినా కూడా రష్యాకు సహాయం చేసేందుకు ముందుకొస్తే యూరప్‌తో ఆర్థిక సంబంధాల ప్రయత్నాల్లో తనను ప్రమాదంలో పడేస్తానని బైడెన్ హెచ్చరించారు.