• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భారత్‌కు మద్దతుగా అమెరికా తీర్మానం

    ఇండో పసిఫిక్ రీజియన్‌లో చైనా దురాక్రమణకు అడ్డుకట్ట వేయాలని అమెరికా భావిస్తున్న తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అరుణాచల్ ప్రదేశ్‌ రాష్ట్రం తమదంటూ చైనా చేస్తున్న ఆరోపణలకు చెక్ పెడుతూ తీర్మానించింది. ఇది ముమ్మాటికీ భారతీయ ప్రాదేశిక ప్రాంతమేనని స్పష్టం చేసింది. అరుణాచల్ ప్రదేశ్‌కు, చైనాకు మధ్య అంతర్జాతీయ సరిహద్దుగా మెక్‌మోహన్ రేఖను పరిగణిస్తున్నట్లు వెల్లడించింది. వాస్తవాధీన రేఖ వెంబడి కొన్నేళ్లుగా చైనా అవలంబిస్తున్న దుందుడుకు చర్యలను అమెరికా సెనేట్ తప్పుపట్టింది. అరుణాచల్ ప్రదేశ్‌ని భారత్‌లో భాగంగానే గుర్తిస్తున్నట్లు తీర్మానంతో స్పష్టం చేసింది.