తైవాన్‌కు USD 1.1 బిలియన్ల ఆయుధాలు US విక్రయం!

Screengrab Twitter:

తైవాన్‌కు 1.1 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలు విక్రయించాలని అమెరికా యోచిస్తోంది. ఈ ఆయుధాలలో 60 యాంటీ షిప్ హార్పూన్ క్షిపణులు, 100 సైడ్‌ విండర్ ఎయిర్ టు ఎయిర్ క్షిపణులు, నిఘా రాడార్లు ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే US స్పీకర్ నాన్సీ పెలోసి తైవాన్‌లో పర్యటించి మద్దతుగా ఉంటామని తెలిపారు. దీంతో చైనా తైవాన్ చుట్టూ భారీగా యుద్ధ కసరత్తులు చేసింది. మరోవైపు చైనా సైనిక డ్రిల్ తర్వాత 2023కి తైవాన్ 17.3 బిలియన్ డాలర్ల రక్షణ బడ్జెట్‌ను ప్రతిపాదించింది. ఈ క్రమంలో తైవాన్‌కు అమెరికా ఆయుధాల అమ్మకం ఆపాలని వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయం పేర్కొంది.

Exit mobile version