వైరల్ ఇన్‌ఫెక్షన్లు గుజరాతీలను వణికిస్తున్నాయి. గత నెల రోజులుగా దగ్గు, జలుబుతో బాధపడే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో విటమిన్, మినరల్, న్యూట్రిషనల్ సప్లిమెంట్స్, ఇమ్యూనిటీ బూస్టర్‌ల కొనుగోలు 20శాతం పెరిగింది. వైరల్ ఫీవర్లు, హెచ్3ఎన్2 వైరస్ చిన్నారులు, వృద్ధులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. దీంతో విటమిన్ సి, డీ3, బీ కాంప్లెక్స్, మల్టీవిటమిన్ టాబ్లెట్లకు భారీగా డిమాండ్ ఏర్పడుతోంది. కోవిడ్ కాలంలో ఇమ్యూనిటీ బూస్టర్ల వాడకం అధికంగా ఉండేది. ఇప్పుడు ఫ్లూ వైరస్ ప్రబలుతున్న దృష్ట్యా ప్రజలు ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారు.