ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ రెండోసారి అధికారం చేపట్టి చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. మొత్తం 403 స్థానాల్లో ఇప్పటికే 273 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తుంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్ అర్భన్ స్థానం నుంచి పోటీ చేసి గెలుపు దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుత ఫలితాలను చూస్తే భాజపా విజయం దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తుంది. ఈ విజయంతో యూపీ రాజకీయ చరిత్రలో ఒక వ్యక్తి పూర్తిస్థాయి సీఎం పదవి చేపట్టి రెండోసారి ఎన్నికవడం ఇదే తొలిసారి అవుతుంది. అలాగే 37 ఏళ్ల తర్వాత భాజపా వరుసగా యూపీలో అధికారంలోకి రావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.