మార్చి 10 వెల్లడయిన ఎన్నికల ఫలితాలలో ఉత్తరాఖండ్ లో 47స్థానాల్లో గెలిచి బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. కానీ అక్కడి సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్కు రాజీనామా లేఖను అందించారు. సంప్రదాయం ప్రకారం కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు ధామీనే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరించనున్నారు. దీంతో తదుపరి సీఎం ఎవరన్నది ఆసక్తిగా మారింది.