‘అఫీషియల్ ట్యాగ్’పై ట్విటర్ యూటర్న్ తీసుకుంది. ఇటీవల ట్విటర్ ‘అధికారిక ఖాతా’ అనే ట్యాగ్ తీసుకొచ్చింది. భారత్‌లోని పీఎం మోదీ, కేంద్రమంత్రులు, రాజకీయ, క్రీడా ప్రముఖుల అకౌంట్లకు అఫీషియల్ ట్యాగ్ కనిపించింది. కానీ కొందరు ప్రభుత్వేతర వ్యక్తులకు కూడా ఈ ట్యాగ్ కనిపించడం అయోమయానికి గురి చేసింది. దీంతో వెంటనే ఈ ట్యాగ్‌ను ట్విటర్ తొలగించింది. ప్రముఖుల అకౌంట్లకు నకిలీ ఖాతాలు పుట్టుకుని రాకుండా ఉండేందుకే ఈ ఫీచర్ ప్రవేశపెట్టారు.
‘అఫీషియల్ ట్యాగ్’పై యూటర్న్

Courtesy Twitter: twitter