మెగా హీరో వైష్ణవ్ తేజ్ నాలుగో సినిమాను ప్రకటించాడు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను నేడు విడుదల చేశారు. ఈడ ఉండేడిది రాముడు కాదప్ప ఆ రావణుడే కొలిసే రుద్ర కాళేశ్వరుడు అంటూ వైష్ణవే తేజ్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతుంది. ఇందులో శ్రీలీలా హీరోయిన్‌గా నటిస్తుంది. శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.