కొత్తగా విదేశాల్లో నివసించాలనుకునేవారికి స్పెయిన్లోని వాలెన్సియా అత్యంత అనువైన నగరమని ఇంటర్నేషన్స్ సంస్థ తెలిపింది. ట్రాన్స్పోర్ట్, జీవన ప్రమాణాలు, క్రీడా అవకాశాలు మెరుగ్గా ఉంటాయని పేర్కొంది. ఇక ఆ తర్వాతి స్థానంలో దుబాయ్ నిలిచింది. మూడో స్థానంలో మెక్సికో ఉంది. ఆసియాలో అత్యంత తక్కువ ఖర్చుతో నివసించదగిన నగరంగా బ్యాంకాక్ 6వ స్థానంలో ఉంది. మెల్బోర్న్ 8వ స్థానంలో నిలిచింది. ఖరీదైన నగరాలుగా పేరు పొందిన లండన్, ప్యారిస్లు 40, 47 స్థానాల్లో నిలిచాయి.