AP: విశాఖకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు వచ్చేసింది. దక్షిణ భారతదేశానికి వచ్చిన రెండో వందే భారత్ రైలు ఇదే. రైలును నిర్వహణ పర్యవేక్షణ కోసం న్యూ కోచింగ్ కాంప్లెక్స్‌కి పంపించారు. సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య ఈ రైలును నడపేందుకు దక్షిణమధ్య రైల్వే ప్లాన్ చేస్తోంది. 8.14గంటల్లోనే గమ్యస్థానానికి చేరుకునేందుకు వీలు పడనుంది. గరిష్ఠంగా ఈ రైలు గంటకు 180 కి.మీ వేగం వెళ్లగలదు. సీసీ కెమెరాలతో నిఘా, లోకో పైలట్ ఆధ్వర్యంలోని కోచ్ డోర్లు, విశాలమైన టాయిలెట్లు ఈ రైలు ప్రత్యేకత. ప్రధాని చేతుల మీదుగా దీనిని ప్రారంభించనున్నారు.