తెలంగాణ: వందే భారత్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం బయలుదేరిన రైలు ఖమ్మం జిల్లా నాగులపంచ రైల్వేస్టేషన్ సమీపంలోకి రాగానే ఎద్దును ఢీకొంది. ఈ ప్రమాదంలో రైలు ముందు భాగం బాగా దెబ్బతింది. దీంతో ఘటనాస్థలిలోనే రైలును నిలిపివేసిన సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు. ఇది పూర్తైన తర్వాత రైలు తిరిగి బయలుదేరుతుందని రైల్వే అధికారులు వెల్లడించారు. దీంతో రాత్రి 11:30కు విశాఖ చేరుకోవాల్సిన రైలు ఆలస్యంగా వెళ్లనుంది.
చెబితే ఒక్క రూపాయి ఇవ్వరు: కేసీఆర్