తెలుగు సినిమా చరిత్రలో పవర్ఫుల్ లేడీ విలన్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు ‘నీలాంబరి’. నరసింహ సినిమాలో రమ్యకృష్ణ చేసిన ఈ పాత్ర తర తరాలకు గుర్తుండిపోయేలా పండింది. ఆ తర్వాత ఎంతమంది లేడీ విలన్స్ వచ్చినా… రమ్యకృష్ణను మాత్రం మరిపించలేకపోయారు. కానీ తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ మళ్లీ ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు. క్రాక్ మొదలుకుని వీర సింహారెడ్డి వరకు తన ఆహార్యం, నటనతో కట్టిపడేస్తున్నారు. దీంతో తెలుగు సినిమాకు లేడీ విలన్ దొరికేసిందంటూ ట్వీట్లు చేస్తున్నారు.