న్యూజిలాండ్, భారత్ మధ్య రెండో వన్డేకు వరణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. తొలుత ఐదు ఓవర్లు పడకముందే వర్షం పడింది. దాదాపు గంటన్నర తర్వాత తగ్గటంతో మ్యాచ్ ను 29 ఓవర్లకు కుదించారు. బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 12.5 ఓవర్లలో 89/1 పరుగులు చేసింది. ఈ క్రమంలో మళ్లీ వర్షం పడటంతో అంతరాయం ఏర్పడింది. శుభమన్ గిల్ 45 పరుగులు, సూర్యకుమార్ 34 పరుగులు చేశారు. మూడు వన్డేల సిరీస్ లో ఇప్పటికే కివీస్ 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది.