దళపతి విజయ్ నటించిన వారసుడు చిత్రానికి ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడిగా చెప్పుకునే క్రిటిక్ ఉమైర్ సంధు.. సినిమా అద్భుతంగా ఉందంటూ వరుస ట్వీట్లు చేశాడు. 3.5 రేటింగ్ ఇచ్చాడు. “ కంటెంట్ సింపుల్గా ఉన్నా మనసుకు హత్తుకుంటుంది. ఫ్యామిలీ డ్రామాలో విజయ్ ఆకట్టుకున్నాడు. తల్లిదండ్రులు, పిల్లల మధ్య అనుబంధాలను బాగా చూపించారు. సినిమాటోగ్రఫీ విజులవల్ ఫీస్ట్. కానీ, ఓ 15 నిమిషాలు ట్రిమ్ చేయాలి.క్లైమాక్స్ మాత్రం అద్భుతం” అన్నాడు.