భారీ ధరకు ‘వారసుడు’ నాన్ థియేట్రికల్ రైట్స్ !

తమిళ స్టార్ హీరో విజయ్, వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో ‘వారసుడు’ అనే మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు భారీ ధరకు అమ్ముడయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ శాటిలైట్ హక్కులను సన్ నెట్వర్క్, ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్, ఆడియో హక్కులను T-సిరీస్ సంస్థలు దక్కించుకున్నాయట. వీటి ద్వారా మూవీకి రూ.115 కోట్లు వచ్చాయని తెలుస్తోంది. కాగా ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ రూ.150 కోట్ల వరకు జరుగుతుందని అంచనా.

Exit mobile version