కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి హీరోగా నటించిన ‘వారసుడు’ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల చేస్తున్నారు. తమిళంలో ‘వారిసు’ టైటిల్‌తో ఈ చిత్రం విడుదల కానుంది. తొలుత జనవరి 12న రిలీజ్ చేయాలని భావించినా ఆదిపురుష్, మెగా154 సినిమాలు కూడా బరిలో ఉండటంతో ముందుగానే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. ఈ సినిమాకు డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు.