సమంతలో గ్లో తగ్గిందనే కామెంట్లపై బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ఆమెకు మద్దతుగా నిలిచాడు. “ మీరు కేవలం నెగటివ్ యాంగిల్లో చూస్తున్నారు. కానీ చూడాల్సింది పనిపట్ల సమంతకు ఉన్న అంకితభావాన్ని. ఒకవేళ మీకు గ్లో కావాలంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫిల్టర్ ఆప్షన్ అందుబాటులో ఉంది “ అంటూ చురకలు అంటించాడు. ఈ కామెంట్స్‌పై సామ్ కూడా ఘాటుగానే బదులిచ్చింది. “ నెలల తరబడి మందులు వాడే రోజులు మీకు రావొద్దని కోరుకుంటున్నాను. మీ గ్లో పెరగాలని ఆశిస్తున్నా” అని పేర్కొంది.