త్వ‌ర‌లో వ‌రుణ్ తేజ్‌ పాన్ ఇండియా మూవీ?

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ న‌టించిన ‘గ‌ని’ సినిమా రేపు విడుద‌ల కాబోతుంది. ఈ సినిమాలో బాక్స‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు వ‌రుణ్‌. కెరీర్ ప్రారంభం నుంచే విభిన్న‌మైన క‌థ‌ల‌కు ప్రాధాన్యం ఇస్తున్న ఈ హీరో త్వ‌ర‌లో ఒక పాన్ ఇండియా చిత్రంలో న‌టించ‌బోతున్న‌ట్లు తెలుస్తుంది. సోనీ పిక్చర్స్ ఇండియా తెర‌కెక్కించే భారీ బ‌డ్జెట్ సినిమాలో వ‌రుణ్ న‌టిస్తాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. దేశభక్తిని చాటిచెప్పే ఈ చిత్రంలో హీరో ఎయిర్ ఫోర్స్ పైలట్ పాత్రలో కనిపిస్తాడ‌ట‌. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ సినిమాతో వ‌రుణ్ బాలివుడ్‌కు ప‌రిచ‌యం కాబోతున్న‌ట్లు టాక్ న‌డుస్తుంది.

Exit mobile version