T20WCలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరగనున్న కీలక మ్యాచ్‌కి వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. ఎడతెరపి లేకుండా జల్లులు పడుతుండటంతో అంపైర్లు టాస్‌ని వాయిదా వేశారు. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండులో ఉదయం అఫ్గాన్, ఐర్లాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దవడంతో ఈ కీలక మ్యాచ్‌పై సందిగ్ధత నెలకొంది. మరోవైపు, 2 మ్యాచుల్లో ఒక విజయంతో పాయింట్ల పట్టికలో AUS అట్టడుగు స్థానంలో ఉంది. ENG కూడా ఇదే సమీకరణంతో ఉన్నప్పటికీ రన్ రేట్ మెరుగ్గా ఉండటంతో 4 స్థానంలో కొనసాగుతోంది.