వరుణ్ తేజ్ హీరోగా, కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా ‘గని’. మొదట ఈ సినిమాను 2021 డిసెంబర్ 24న విడుదల చేయాలని భావించగా.. కరోనా కారణంగా వాయిదా పడింది. తరువాత ఫిబ్రవరి 25న విడుదల చేయాలని ప్రయత్నించినా, భీమ్లానాయక్ సినిమా కారణంగా మరోసారి వాయిదా పడింది. దీంతో ఈ సినిమాను ఏప్రిల్ 8వ తేదీన విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది.