• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Veena Rao: ఎన్టీఆర్ సరసన హీరోయిన్‌గా తెలుగు అమ్మాయి..  ఆమె ఎవరంటే?

    నందమూరి కుటుంబం నుంచి మూడో తరం నట వారసుడిగా హీరో తారక రామారావు (జానకిరామ్ కుమారుడు, హరికృష్ణ మనవడు) ప్రధాన పాత్రలో వై.వి.ఎస్. చౌదరి దర్శకత్వంలో ఓ కొత్త సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను వై.వి.ఎస్. చౌదరి సతీమణి గీత ‘న్యూ టాలెంట్ రోర్స్’ పతాకంపై నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీత సారథ్యం వహిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా వీణారావు పరిచయం కాబోతోంది.

    వీణారావు ఎవరంటే( Who is Veena Rao)

    విజయవాడకు చెందిన వీణారావు( Veena Rao) ఈ సినిమాలో నందమూరి తారక రామారావు(Nandamuri Traraka Rama Rao) సరసన కనిపించనున్నారు. ఆమెకు కూచిపూడి నాట్యంలో మంచి ప్రావిణ్యం ఉందని వై.వి.ఎస్. చౌదరి(Y.V.S Chowdary) తెలిపారు. వీణారావు అచ్చతెలుగు అమ్మాయి అని, ఆమెను ప్రేక్షకులకు పరిచయం చేయడం ఆనందంగా ఉందని చెప్పారు.

    మీడియా సమావేశం ద్వారా పరిచయం

    హీరోయిన్‌ను మీడియా సమావేశంలో పరిచయం చేసిన వై.వి.ఎస్. చౌదరి మాట్లాడుతూ, సీనియర్ ఎన్టీఆర్ నటించిన ‘యుగంధర్’ సినిమా 1979 నవంబర్ 30న విడుదలైందని, అందుకే అదే రోజున వీణారావును పరిచయం చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.

    సుప్రియ, స్వప్నదత్ అభినందనలు

    ఈ సందర్భంగా నిర్మాత సుప్రియ మాట్లాడుతూ, “వైవీఎస్ చౌదరి గారు కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు. చాలా మందిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఆయన ద్వారా వీణారావుకు మంచి భవిష్యత్తు ఉంటుంది” అన్నారు.

    స్వప్నదత్ మాట్లాడుతూ, “తెలుగు అమ్మాయిలు ఎక్కువగా సినీ పరిశ్రమలోకి రావాలి. అచ్చ తెలుగుతనం ఉన్న విజయవాడ అమ్మాయి వీణారావు కథానాయికగా పరిచయం అవ్వడం హర్షణీయం” అన్నారు.

    వైరల్ అవుతున్న ఫోటోలు

    వీణారావు ఈ చిత్రంతో తెరంగేట్రం చేయనున్నట్లు ప్రకటించినప్పటినుంచి ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తెలుగు  ప్రేక్షకులు ఈ నూతన జంటను తెరపై చూడటానికి ఆసక్తిగా ఉన్నారు.

    గీత ధన్యవాదాలు

    చిత్ర నిర్మాత గీత మాట్లాడుతూ, వీణారావును ప్రేక్షకులకు పరిచయం చేయడంలో సుప్రియ, స్వప్నదత్‌ల పాత్రకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోవాలని ఆకాంక్షించారు.

    సినిమా విశేషాలు

    తారక రామరావు, వీణారావు జంటగా వస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది 2025లో విడుదల చేయనున్నట్లు డైరెక్టర్ వైవీఎస్ చౌదరి తెలిపారు. వీణారావు తన నాట్య నైపుణ్యంతో పాటు అచ్చతెలుగు సౌందర్యంతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంటారని ఆశిద్దాం.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv